బ్రిజ్ భూషణ్​ కొడుకు గెలుపు

బ్రిజ్ భూషణ్​ కొడుకు గెలుపు

న్యూఢిల్లీ: రెజ్లింగ్  సమాఖ్య మాజీ చీఫ్, తాజా మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్​ శరణ్​ సింగ్  కొడుకు, బీజేపీ అభ్యర్థి కరణ్​ భూషణ్  సింగ్.. కైసర్ గంజ్  లోక్ సభ నియోజకవర్గంలో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి భగత్  రామ్ పై 1,48,843 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

కరణ్​కు 5,71,263 ఓట్లు రాగా.. భగత్  రామ్ కు 4,22,420 ఓట్లు పోలయ్యాయి. కాగా..మహిళా రెజ్లర్లపై బ్రిజ్  భూషణ్  సింగ్   లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిజ్ కు బదులు ఆయన కొడుకు కరణ్​కు బీజేపీ హైకమాండ్  టికెట్  ఇచ్చింది.

తన కొడుకు విజయంపై బ్రిజ్ భూషణ్  మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్లే కరణ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కైసర్ గంజ్ లో ఉన్న ఒకేఒక ఇష్యూ బ్రిజ్ భూషణ్  మాత్రమే అని చెప్పారు.

లఖింపూర్ ఖేరీలో ఎస్పీ విజయం

లఖింపూర్ ఖేరీ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి ఉత్కర్ష్  వర్మ మాధుర్  ఘన విజయం సాధించారు. 34,329 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్  కుమార్ ను ఆయన ఓడించారు. ఉత్కర్ష్ కు 5,57,365 ఓట్లు రాగా.. అజయ్ కు 5,23,036 ఓట్లు వచ్చాయి. అలాగే బీఎస్పీ అభ్యర్థి అన్షాయ్  కల్రాకు 1,10,460 ఓట్లు పోలయ్యాయి.